గులాబ్ జామున్ విశేషాలు.

హలో ఫ్రెండ్స్.
వెల్కమ్ టూ అమ్మ రుచులు.
ఈ రోజు అమ్మ రుచులు మొదటి వంటకం ఏదయినా స్వీట్ తో మొదలు పెడదాం అని  మన అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ ని ఎంచుకున్నాను. టీవీలో  యుమ్మీ యమ్మీ గులాబ్ జామున్  టేస్టీ టేస్టీ 
గులాబ్ జామున్ అని యాడ్ వచ్చి పిల్లలు అంత నోరు వెళ్ళబెట్టి చూసేలా కట్టి పడేస్తుంది.
ఇది ప్రతి ఒక్కరికి ఇష్టమైన, ప్రియమైన, రుచికరమైన ఆహార పదార్ధం.దీనిని గురించి తీపి ని ఇష్టపడే వాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రతి ఇంట్లో చిన్న వేడుక పుట్టినరోజు నుండి పెద్ద వేడుక  పెళ్లి వరకు ఇది లేకుండా జరగదు.
  చిన్న చిన్న గుండ్రటి లడ్డూలు ముదురు బంగారు రంగు లేక నల్లటి రంగును కలిగి ఆ చక్కెర పానకంలో మునిగి తియ్యని రుచితో ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.చూడగానే నోట్లో నీళ్లు వూరడం, మెత్తగా ఉండి నోట్లో వేసుకోగానే కరిగి అలా అలా లోపలికి వెళ్లిపోతుంది. 

 గులాబ్ జామున్ తయారీ.


గులాబ్ జామున్ తయారీకి మనం ఒక గులాబీ జామున్ పిండి ప్యాకెట్ తీసుకోవాలి .
దానిని ఒక బౌల్ లో వేయాలి పాలు లేదా  నీళ్ళు  వేసి ఉండలు లేకుండా మెత్తగా కలపాలి.
పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
స్టవ్ మీద కడయి పెట్టి దానిలో వేయించడానికి సరిపడా నూనె వేయాలి.
ఒక్కొక్కటిగా ఆ చిన్న ఉండలు వేయించి వాటిని పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టి చక్కెర  వేసి తగినన్ని నీళ్లు పోసి చిక్కటి పాకం వచ్చాక దించాలి.
వేయించిన ఉండలు పాకంలో వేయాలి వాటిని  ఒక 5 గంటలు నాననిస్తే  టేస్టీ టేస్టీ గులబ్ జామున్ తయారు అవుతుంది.
ఈ గులాబ్ జామున్ లలో ఐస్ క్రీమ్ వేసుకుని తింటే సూపర్ ఉంటది.
ఇంకా ఇప్పుడు గులాబ్ జామున్ ను కాల జామున్ అని ,బ్రెడ్ గులాబ్ జామున్ అని రకరకాలుగా తయారు చేస్తున్నారు.
ఇది పర్షియన్ వంటకం అని అంటుంటారు కానీ ఇది మాత్రం మన దేశంలో ప్రతి ఇంట్లో ఒక భాగం .
ఇది తయారు చేయడానికి పెద్ద సమయం పట్టదు అలాగే తినడానికి కూడా.ఏదయినా చిన్న సెలెబ్రేషన్ కూడా గులాబ్ జామున్ తో చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆ గులాబ్ జామున్.
ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని ఆ తియ్యని మెత్తని గులాబ్ జామున్ ని నోట్లో వేసుకొని ఆ తీపిని గుర్తు చేసుకొని ఆ గులాబ్ జామున్ ని ఆస్వాదించండి.
కామెంట్ చేయండి మీలో ఎవరికి ఇష్టం లేదో?

Comments