పావ్ బాజి ఎలా తయారు చేయాలి.

   హలో ఫ్రెండ్స్.                                                     
  వెల్కమ్ టూ అమ్మ రుచులు.
ఈ రోజు మన అందరికి ఇష్టమైన పావ్ బాజి రెసిపీ నేర్చుకుందాం.ఇది ముంబై స్ట్రీట్ ఫుడ్ గా చాలా ఫేమస్.
నిజం చెప్పాలంటే నాకు కూడా ఇది రాదు కానీ యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా.
 రోడ్ మీద చిన్న బండి దగ్గర నుండి పెద్ద రెస్టారెంట్ వరకు అంతటా ఇది దొరుకుతుంది. తిన్నోళ్లకు తిన్నంత అంతే.నాకు కూడా మొదట ఇది నచ్చేది కాదు నేను అది చూసి దూరంగా పారిపోయే దాన్ని, అయితే ఇది మా ఆయన ,నేను షిర్డీ వెళ్ళినపుడు ఆకలి వేస్తుంది ఏమైనా తిందాం అని బయటకు వెళ్ళాం.అక్కడ ఇది తప్ప ఇంకొక ఆప్షన్ లేదు నాకు సరే లే తింటే తిందాం లేకపోతే లేదు అనుకుంటూ మొదలు పెట్టాను కానీ నిజంగా సూపర్ అసలు .సో అప్పటి నుండి ఇంకా రెగ్యులర్ ఈవెనింగ్ స్నాక్స్ అయిపోయింది.


కావలిసిన పదార్థాలు.

ఎండుమిర్చి 4-5,
దాల్చిన చెక్క,
బంగార ఆకు,
జీలకర్ర.
ధనియాలు.
మిరియాలు.
బంగాళాదుంపలు.
క్యారెట్
పచ్చి బటాని.
టమోటాలు.
పసుపు.
కారం .
క్యాప్సికమ్.
ఆమ్ చూర్ పొడి.
ఉల్లిపాయలు.
అల్లం వెల్లుల్లి పేస్ట్.
కసూరి మేతి.
బట్టర్.

తయారు చేసే విధానం.

స్టెప్ 1 : పావ్ బాజి మసాలా తయారీ.

ఎండు మిర్చి 4నుండి 5 ,ధనియాలు 1 టేబుల్ స్పూన్. ,  మిరియాలు హాఫ్ స్పూన్. ,  జీలకర్ర, దాల్చిన చెక్కఒకటి , బగార ఆకు 1 ఒక కడాయి లో వేసి చిన్న మాన్తా మీద వేయించాలి.దీనిలో కొంచెం పసుపు, ఆమ్ చూర్ పౌడర్ ని  వేసి మొత్తం మిక్సీలో వేసి  గ్రైండ్ చేయాలి.

స్టెప్ 2:  పావు బాజికి కూర తయారీ.




బంగాళాదుంపలు , క్యారెట్ , పచ్చి బటాని ,టమోటాలు ,కొంచెం పసుపు,రుచికి సరిపోయేంత కారం వేసి 1 గ్లాస్ నీళ్లను పోసి కుక్కర్ లో ఉడక బెట్టాలి.3 విసిల్స్ వచ్చిన తర్వాత స్మాషేర్ తో మొత్తం కొంచెం పలుకు ఉండేట్లు స్మాష్ చేయాలి.దీనిని పక్కన పెట్టుకోవాలి.
కడాయి పెట్టి మంచి నూనె వేయాలి తర్వాత దానిలోనే బట్టర్ వేయాలి .ఇప్పుడు తాలింపుకి జీలకర్ర వేసి ,ఉల్లిపాయ ముక్కలు వేయాలి.అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేయాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళా దుంప మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం కారం వేసి ,తయారు చేసి పెట్టుకున్న పావు బాజి మసాలాను కూడా వేయాలి.ఇది కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడక బెట్టాలి.కొంచెం సేపయ్యక కేసరి మేథీ వేసి కలిపి దించాలి.అంతే పావు బాజి కూర తయారు అయింది.
బ్రెడ్ కావాలంటే బయట తెచ్చుకొని మంచిగా బట్టర్ వేసి వేయించి కట్ చెస్తే సరిపోతుంది.బయట నుండి వద్దు అది కూడా ఇంట్లో నే ప్రిపేర్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఈ బన్ తయారీ.

స్టెప్ 3:బన్ తయారీ.

ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా గోరు వెచ్చని నీళ్లు వేయాలి ఆ తర్వాత డ్రై ఈస్ట్ ని వేయాలి కొంచెం చక్కెర వేయాలి.
పావుగంట పాటు పక్కన ఉంచాలి.అది చక్కెరతో కలిసి పులుస్తుంది ఇప్పుడు మైదా పిండిని వేసి కొంచెం స్టికీ గా ఉండేటట్లు కలపాలి మధ్య మధ్యలో ఆయిల్ వేసి కలపాలి .ఒక అరగంట పాటు దాన్ని పక్కన ఉంచాలి. ఆ పిండి కొంచెం పొంగుతుంది మళ్ళీ దాన్ని ఒకసారి కలిపి  చిన్న చిన్న ముద్దలుగా  చేసి ,ఒక మందపాటి గిన్నెకి నూనె రాసి దానిలో వేయాలి.ఆ గిన్నె ఒవేన్ లో కానీ లేకపోతే స్టవ్ మీద కానీ పెట్టాలి ఆ ముద్దలకు పైన కొంచెం లైట్ గా పాలు అప్లై చేయాలి.15 నిముషాల తర్వాత దించి రెండు ముక్కలుగా చేసి బట్టర్  వేసుకోవాలి కొంచెం లైట్ గా కాల్చాలి.ఇప్పుడు గిన్నె తీసుకొని దానిలో పావ్ బాజి కూర వేసి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా చేసి,కొంచెం బట్టర్ కొద్దిగా నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతోంది.లెట్స్ ఎంజాయ్.ఎవరెవరికి ఈ పావ్ బాజి ఇష్టమో కామెంట్ చేయండి.












Comments

Post a Comment

Popular Posts