మిర్చి బజ్జి.
హలో ఫ్రెండ్స్.
వెల్కమ్ టూ అమ్మ రుచులు.
ఈ రోజు మనం తినే food ఏంటో తెలుసా?
బయట వర్షం పడుతుంది ఎమోయ్ వేడి వేడిగా బజ్జీలు తినాలనిపిస్తుంది చేస్తావా? అని ఆర్డర్ వేసే మొగుడు.ఇద్దరు స్నేహితులు సాయంత్రం బయటకు వెళ్లి అరేయ్ బజ్జి తిని చాయ్ తాగుదాం రా అని మాట్లాడుతూ ఉంటారు. అమ్మ కొంచెం బజ్జి చేయవా తినాలనిపిస్తుంది అంటుంది ఒక కూతురు.సాయంత్రం బయటకు వెళ్లినా ,బయట నుండి ఇంటికి తెచ్చుకున్నా first and foremost ఆప్షన్ ఏదయినా ఉంది అంటే మిర్చి బజ్జే.
సో రండి మనం ఏ రోజు మిర్చి బజ్జి తిందాం ! కాదు కాదు వేద్దాం! అయ్యో రాకుండా ఎలా చేస్తాం మొదట నేర్చుకుందాం పదండి
కావాల్సిన పదార్థాలు.
1 .శనగ పిండి.
2 .ఉప్పు.
3 . కారం.
4 . వంట సోడా చిటికెడు.
5 .మిర్చిలు.
6 .మంచి నూనె.
7 . నీళ్లు తగినన్ని.
8 .ఉల్లిపాయలు.
9 . చింతపండు.
10 .జీలకర్ర.
11. వాము.
తయారీ విధానం.
ముందుగా నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని గింజలు లేకుండా తీసి నాన బెట్టాలి.ఒక బౌల్ లో శనగపిండి వేయాలి.కొద్దిగా ఉప్పు ,కారం వాము ,చిటికెడు వంట సోడా వేసి పిండిని జారుగా కలపాలి.ఇది కొద్ది సేపు పక్కన పెట్టుకోవాలి.
చింతపండు మిక్సీలో వేసి కొద్దిగా వాము ,జీలకర్ర వేసి మిక్సీ చేయాలి.
మిర్చిలను చివర కోసి లోపల ఉన్న గింజలను తీయాలి.ఇప్పుడు చింతపండు వాము మిశ్రమాన్ని పెట్టాలి . ఇప్పుడు స్టవ్ మీద కడయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె వేసి వేడి చేయలి.నూనె వేడయ్యాక చింతపండు పెట్టుకున్న మిర్చిలను కలిపి పెట్టుకున్న శనగపిండిలో ముంచి నూనెలో వేయాలి.ఈ మిర్చిలను రెండు వైపులా దోరగా వేయించాలి.
ఇంకొక బౌల్ లో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు,కొత్తిమీర కారం వేసి మిర్చిల పైన వేసి స్టఫ్ చేసుకొని ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో అరటికాయ బజ్జిలు చాలా ఫేమస్. రాయలసీమ వాళ్లకు ఐతే చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఉగ్గాని బజ్జి తినని వాళ్ళు వుండరు నిజంగా అంత ప్రత్యేకం.
మీలో ఎవరెవరు మీ స్నేహితులతో కలిసి మిర్చి తిన్నారో కామెంట్ చేయండి.
Comments
Post a Comment