జిలేబి ఎలా తయారు చేయాలి.

నాయక్ సినిమా లో హీరోయిన్ ను  ఎవరో ఏడిపిస్తున్నారు అని చెప్పడంతో జయప్రకాష్ నారాయణ  వారని పిలుస్తాడు. అప్పుడు బ్రహ్మానందం, రామ్ చరణ్ లు  వస్తారు జయప్రకాష్ నారాయణ ఒరేయ్ నీ పేరు ఏంట్రా అని అడుగుతాడు .రామ్ చరణ్ దానికి చెర్రీ అని చెప్తాడు, బ్రహ్మానందం జిలేబి అని చెప్తాడు. జయప్రకాష్ నారాయణ వెంటనే వేరే ఏ పేర్లు దొరకనట్టు ఒకడు ఫ్రూట్ పేరు ఇంకొకడు స్వీట్ పేరు పెట్టుకొని తమాషా చేస్తున్నారా అంటాడు.దానికి బ్రహ్మానందం నేను జిలేబి స్వీట్ షాప్ లో పుట్టానని ఆ పేరు పెట్టారు అంటాడు.
ఇప్పుడు అర్థం అయిందా నేను దేన్నీ గురించి చెప్తున్న అని అదేనండి జిలేబి .జిలేబి అంటే చాలా మందికి ఇష్టం.దానిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు.

చక్కెర.
నీళ్లు.
నూనె.
మైదాపిండి.
ఇలాచి పొడి.
పటిక.
కుంకుమ పువ్వు(optional).
Or
Food colour.

తయారీ విధానం.

ముందుగా ఒక గిన్నె తీసుకొని మైదాపిండి 2 కప్పులు వేయాలి దానిలో 4 కప్పుల వరకు నీటిని పోయాలి.పిండిని మెత్తగా ఉండలు లేకుండా జారుడుగా కలపాలి.ఆ తర్వాత పిండిని 48 గంటలు పులియబెట్టాలి.
ఇంకొక ఆప్షన్ కూడా ఉండండి 48 గంటలు పులియబెట్టకుండా జస్ట్ 2 hrs పెడితే చాలు, దానికి మాత్రం మైదాపిండిలో పెరుగు వేసి  బాగా కలిపి పక్కన పెట్టాలి కొంచెం ఫుడ్ కలర్ కానీ కుంకుమ పువ్వు కానీ వేసుకోవచ్చు అది మన ఇష్టం మాత్రమే.
స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దానిలో వేయించడానికి సరిపడ నూనె వేయాలి . ఇంకొక పొయ్యి మీద గిన్నె పెట్టీ  నీళ్ళు పోసి చక్కెర వేయాలి. పాకం తయారు చేయాలి తీగ పాకం వచ్చాక స్టవ్ ఆపేయాలి. ఒక పాల పాకెట్ తీసుకొని చివర చిన్నగా కట్ చేయాలి.దానిలో 48 గంటలు పులిసిన పిండి వేసి మెల్లిగా చిన్న చిన్న జిలేబీలు వేయాలి ముదురు వర్ణం లోకి మారాక తీసి పాకంలో ముంచి తీయాలి.పాకం పీల్చుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసి సర్వ్ చేసుకోవాలి అంతే వేడి వేడి జిలేబీలు రెడీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు .తిని Happy గా ఉండండి.












Comments