అష్టాంగ యోగం అంటే ఏమిటి ?

 ఈ రోజు మన topic అష్టాంగ యోగం .

ఇదేంటి వేదాంతం మనకు ఎందుకు అనిపిస్తుందా అష్టాంగ యోగం అనేది వేదాంతం కాదు , ఈ కాలానికి కూడా సరిపోయే ఒక ప్రక్రియ.

అష్టాంగ యోగం అంటే మన శరీరం, మనస్సు, ఆలోచనలు, ప్రవర్తనలను క్రమబద్ధంగా మార్చుకుని ఆత్మజ్ఞానం వైపు నడిపించే యోగ మార్గం. దీనిని మహర్షి పతంజలి తన యోగసూత్రాలలో ఎనిమిది అంగాలుగా వివరించారు.

“అష్ట” అంటే ఎనిమిది, “అంగ” అంటే భాగం. అందుకే దీనిని అష్టాంగ యోగం అంటారు. ఇదే అసలు కథ కానీ దీని వెనుక ఉన్న నియమాలు ఇప్పటికీ మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో మనం తెలుసుకుందాం.

అష్టాంగ యోగంలోని ఎనిమిది అంగాలు ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు వివరంగా చర్చిద్దాం.

1. యమం
ఇతరులతో మన ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పే నియమాలు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఇందులో ఉన్నాయి.ఉదాహరణకు మనకు  ఒక వ్యక్తి  మనకు నచ్చలేదు అనుకోండి ఆ వ్యక్తిని మనం ఎంతసేపు చెడు దృష్టితోనే చూస్తాం తప్ప అతని గురించి మంచిగా ఆలోచించలేము , అదే మనకు నచ్చిన వ్యక్తి మనకు నచ్చని పని చేసినా కూడా మనం వారిని వ్యతిరేకించలేము . ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి మనకు మనం ఎంత కరెక్ట్ గా ఉన్నామో తెలుస్తుంది. అహింస అనేది చాలా వరకు మనం పాటిస్తాము , ప్రతిసారి సత్యమే చెప్తాము అన్న గ్యారంటీ అయితే లేదు. దొంగతనం అనేది దొంగల పనే కాదు , మనలో చాలా మంది రకరకాల దొంగలు ఉంటారు, అది మనకు కూడా తెలియదు మనము దొంగలమూ అనే విషయం.బ్రహ్మచర్యం అనేది శారీరకమైనది కాదు మనసుకు సంబంధించిన విషయం . శరీరంతో పాటు మనసు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి.

2. నియమం

మన ఇంట్లో ఉదయం లేవగానే మొదట కాలకృత్యాలు తీర్చుకుంటాం. తర్వాత మళ్ళీ శరీరాన్ని శుభ్రం చేయడానికి స్నానం చేస్తాం తర్వాత తినడం తాగడం పాటిస్తాము .ఇవన్నీ మనం పెట్టుకున్న నియమాలు .  బ్రతకడానికి అవసరమైన విద్యను నేర్చుకోవడం . ఈశ్వరుడికి మన జీవితాన్ని అంకితం చేయడం మనస్సును మన ఆధీనంలో ఉంచుకోవడం.

3. ఆసనం
శరీరాన్ని ఆరోగ్యంగా, స్థిరంగా ఉంచేందుకు చేసే యోగ భంగిమలు ప్రతి ఒక్కరికి యోగా తప్పక అవసరం. శరీరం స్థిరంగా, సౌకర్యంగా ఉండటం ఆసన లక్ష్యం.వ్యాయామాలు చేయడం వల్ల శరీరానికి కావలసిన ఫ్లెక్సిబిలిటీ 

వస్తుంది . ప్రతి ఒక్క అవయవం చురుగ్గా పని చేస్తాయి రక్తప్రసరణ మెరుగయ్యి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ రోజుల్లో చాలా మందికి శారీరక శ్రమ తక్కువ అయింది అలాగే వ్యాయామాలు కూడా తగ్గిపోయాయి .దృఢమైన శరీరం కోసం వ్యాయామం చాలా అవసరం.

4. ప్రాణాయామం.

శ్వాస మీద ధ్యాస పెట్టండి అని యోగాలో చెప్తారు .ఇది 
శ్వాసను క్రమబద్ధంగా నియంత్రించే సాధన దీని వల్ల  మనలోన దాగివున్న శక్తిని బహిర్గతం చేస్తుంది   . ఇది శ్వాసపై అవగాహన పెంచడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బీపీ ,గుండెజబ్బులు తగ్గుతాయి ఈ రోజుల్లో చాలా మందికి స్ట్రెస్ ఎక్కువగా అయిపోయి  ఏవేవో చేస్తున్నారు .మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు మన అలవాట్లు మన భవిష్యత్తును  నిర్ణయిస్తాయి.అందుకే అలవాట్లను ఒక్కొక్కటిగా మార్చుకోవాలి.

5. ప్రత్యాహారం

బాహ్య విషయాల నుంచి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం.మనుషులకు ప్రతి ఒక్కరికి కోపం , ప్రేమ బాధ,సంతోషం అన్ని  ఉంటాయి .అవన్నీ సందర్భానుసారంగా ఉపయోగించాలి. బాగా కోపం వచ్చింది అనుకోండి మనలాగే ఎదుటి వాళ్ళు కూడా విచక్షణ కోల్పోయినపుడు మనం తగ్గాలి అంతే కానీ నేను ఎందుకు తగ్గాలి అని అనుకోవద్దు.ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే మనిషి. 

అందుకే కొన్ని సార్లు ఆగి ఆలోచించాలి మనకు మన సెల్ఫ్ కంట్రోల్ లేనప్పుడు విపరీతమైన బాధ కలుగుతుంది ఇది మాత్రం నా వ్యక్తిగత అనుభవం. So please be attentive for everything. సంతోషంగా ఉన్నప్పుడు హై లో ఉంది బాధ వచ్చినపుడు లో గా ఉండొద్దు మిన్ను విరిగి మీద పడినా మనం చలించవద్దు .జరిగేవి జరగకుండా ఉండవు మనం ఎంత ఆపినా కొన్ని పరిస్థితులు మారవు దానికోసం మన ఇంద్రియాలన్నింటి ఫణంగా పెట్టడం ఏ మాత్రం సరికాదు.

6. ధారణ

మనస్సును ఒకే అంశం లేదా వస్తువుపై కేంద్రీకరించడం. ఏకాగ్రతను పెంచే సాధనగా దీనిని చూడవచ్చు . ఇది కూడా యోగా వంటిదే . మన లక్ష్యం మీద మనకు సరి అయిన దృష్టి ఉండడం అవసరం . మనకు వున్న టెంప్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఏది చూస్తే దాని మీదకు మనసు మళ్ళుతుంది. మన ఆధీనంలో లేని మన మనసు మన ఆలోచనలను నియంత్రిస్తుంది అలా ఉండకూడదు.

7. ధ్యానం.

ధారణ ,ధ్యానం రెండూ  దగ్గర సంబంధం ఉన్న రెండు వేర్వేరు విషయాలు.
ఒకే విషయంపై నిరంతరంగా, ప్రశాంతంగా మనస్సును నిలిపే స్థితి. ధ్యానం ద్వారా మనస్సులోని ఆలోచనలను గమనించే సామర్థ్యం పెరుగుతుంది.ఒక్కసారి శ్వాస మీద ధ్యాస పెట్టీ చూడండి మన మీద మనకు లోతైన అవగాహన ఏర్పడుతుంది.

8. సమాధి
ధ్యానం మరింత లోతైన స్థితికి చేరినప్పుడు కలిగే ఆధ్యాత్మిక అనుభవాన్ని సమాధి అంటారు. ఇది అష్టాంగ యోగంలోని అత్యున్నత అంగంగా పరిగణించబడుతుంది.మనకు ఆ ప్రత్యేక అనుభూతి కలిగినపుడు బయట ప్రపంచంతో బాహ్య కోరికలతో సంబంధం లేనట్టు ఉంటుంది.అంత దీర్ఘంగా ఆలోచించడం అవసరం లేదు కానీ మనం మనలాగా ఉండాలి.

అష్టాంగ యోగం యొక్క ముఖ్య ఉద్దేశం

అష్టాంగ యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు. మంచి ప్రవర్తన → క్రమశిక్షణ → శరీర సాధన → శ్వాస నియంత్రణ → ఇంద్రియ నియంత్రణ → ఏకాగ్రత → ధ్యానం → ఆధ్యాత్మిక అవగాహన అనే క్రమంలో మనిషిని అభివృద్ధి చేయడం దీని ప్రధాన భావన.

సులభంగా చెప్పాలంటే:

“శరీరాన్ని ఆరోగ్యంగా, శ్వాసను క్రమబద్ధంగా, మనస్సును ప్రశాంతంగా, ఆలోచనలను నియంత్రణలో ఉంచి ఉన్నతమైన ఆత్మజ్ఞానం వైపు నడిపించే మార్గమే అష్టాంగ యోగం.”

Comments