simple and tasty vegetable rice preparation
ఒక్కోసారి మనం తింటున్న ఫుడ్ చాలా రొటీన్ అనిపిస్తుంది నోటికి ఏదైనా రుచికరంగా తినాలి
రుచికరమైన, సులభంగా తయారు చేసుకోగల వెజిటబుల్ రైస్ పిల్లలకు, పెద్దలకు మంచి లంచ్ లేదా డిన్నర్ ఆప్షన్. ఇంట్లో ఉన్న కూరగాయలతోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు.
బియ్యం – 2 కప్పులు (బాస్మతి బియ్యం)optional
క్యారెట్ – 1
బీన్స్ – 8 నుంచి 10
పచ్చి బఠాణీలు – ¼ కప్పు
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 2
టమోటా - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
జీలకర్ర – ½ టీస్పూన్
షాజీరా -1/2 టీ స్పూన్
గరం మసాలా – ½ టీస్పూన్
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు – 1¾ నుంచి 2 కప్పులు
పుదీనా, కొత్తిమీర – కొద్దిగా.
👩🍳 తయారు చేసే విధానం
బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.
కుక్కర్లో నూనె లేదా నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర వేయాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి.కొద్దిగా షాజీరా వేసుకోవాలి.ఒక చిన్న టొమోటో ముక్కలు వేయాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
తరువాత క్యారెట్, బీన్స్, బఠాణీలు వేసి 2–3 నిమిషాలు వేయించాలి.మూత పెట్టీ ఉడకబెట్టాలి దాని వల్ల ఆవిరి బయటకు పోకుండా మంచిగా ఉడుకుతుంది.
పసుపు, గరం మసాలా, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు వంపి కుక్కర్లో వేయాలి. నీళ్లు పోసి మెల్లగా కలపాలి.
కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై 1 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత ప్రెషర్ పూర్తిగా తగ్గాక మూత తీసి అన్నాన్ని మెల్లగా కలపాలి. దీని వల్ల నీటి ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది. బియ్యం రకాన్ని బట్టి నీటి పరిమాణం, ఉడికే సమయం మారవచ్చు.
ఎక్కువ కూరగాయలు వేసుకుంటే ఫైబర్ తీసుకోవడం పెరుగుతుంది.
నూనె, ఉప్పు మితంగా ఉపయోగించండి.
క్యారెట్, బీన్స్, బఠాణీలతో పాటు కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు.
రైతా చేయాలంటే ముందుగా పెరుగును
బీట్ చేసి స్మూత్ గా చేయాలి ఇపుడు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి.పచ్చిమిర్చి కూడా చిన్నగా తరిగి వేయాలి కొంచెం ఉప్పు వేసి కలపాలి.ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరు వేసి అడ్జస్ట్ చేసుకోవాలి.రైతా చిక్కగా ఉంటేనే వెజిటబుల్ రైస్ కి బాగుంటుంది.ఇప్పుడు పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఈ వెజిటబుల్ రైస్ తినడం వల్ల అన్ని కూరగాయలు సమపాళ్ళలో అందుతాయి దానితో పాటు ఫైబర్, ప్రోటీన్ శరీరానికి అందుతుంది .కొంచెం కొత్తగా టేస్టీగా తిన్న అనుభవం వస్తుంది. మీకు అందుబాటులో ఉన్న అన్ని వెజిటబుల్స్ ను ఉపయోగించి చేసుకోవచ్చు.సో let's try these recipie.
Comments
Post a Comment